శ్రీలంక ప్రధానికి ఘన వీడ్కోలు

ABN , First Publish Date - 2021-12-25T05:37:17+05:30 IST

తిరుమల పర్యటనకు విచ్చేసిన శ్రీలంక ప్రధాని మహేంద రాజపక్సె శుక్రవారం సాయంత్రం తిరుగుప్రయాణమయ్యారు.

శ్రీలంక ప్రధానికి ఘన వీడ్కోలు
మహేంద రాజపక్సెకు జ్ఞాపిక అందజేస్తున్న డిప్యూటీ సీఎం తదితరులు

రేణిగుంట, డిసెంబరు 24: తిరుమల పర్యటనకు విచ్చేసిన శ్రీలంక ప్రధాని మహేంద రాజపక్సె శుక్రవారం సాయంత్రం తిరుగుప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తదితరులు శ్రీవారి చిత్రపటాన్ని అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హరినారాయణన్‌, అర్బన్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడు, ఆర్డీవో కనకనరసారెడ్డి, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ సురేష్‌, సెక్యూరిటీ ఆఫీసర్‌ రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-25T05:37:17+05:30 IST