నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్‌లో నైపుణ్య శిక్షణ

ABN , First Publish Date - 2021-07-12T06:29:03+05:30 IST

టాటా ట్రస్టు సహకారంతో నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్‌లో నైపుణ్య శిక్షణ అందించనున్నారు.

నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్‌లో నైపుణ్య శిక్షణ

తిరుపతి రూరల్‌, జూలై 11: టాటా ట్రస్టు సహకారంతో నిరుద్యోగ యువతకు ఆన్‌లైన్‌లో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌ అందించి బెంగళూరు, హైదరాబాదు కేంద్రాల్లో నెలకు రూ.14వేల నుంచి రూ.18 వేల జీతంతో కూడిన ఉపాధి అవకాశాలు పొందేందుకు కూడా తోడ్పాటు అందించనున్నారు. 18-29 ఏళ్ల మధ్య వయసున్న ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమో చదువుకున్న వారు అర్హులు. 90 రోజుల శిక్షణ కాల పరిమితిలో రోజుకు రెండు గంటలు మాత్రమే శిక్షణ ఉంటుంది. ఇంటి నుంచే స్మార్ట్‌ ఫోన్ల ద్వారా స్పోకెన్‌ ఇంగ్లీష్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లైఫ్‌ స్కిల్స్‌, ఇంటర్వ్యూ స్కిల్స్‌, కస్టమర్‌ రిలేషన్‌ స్కిల్స్‌, డిజిటల్‌ లిట్రసీ అంశాల్లో శిక్షణ పొందవచ్చు. వివరాలకు 63053 34287, 90004 87423 నెంబర్లలో సంప్రదించాలని కో-ఆర్డినేటర్‌ హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో సూచించారు. 

Updated Date - 2021-07-12T06:29:03+05:30 IST