ఎమ్మెల్యేను అగౌరవపరిచిన హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు

ABN , First Publish Date - 2021-09-04T05:15:03+05:30 IST

క్రీడా దినోత్సవానికి ఎమ్మెల్యేని పిలిచి అగౌరపరచిన హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.

ఎమ్మెల్యేను అగౌరవపరిచిన హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు

చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 3: క్రీడా దినోత్సవానికి ఎమ్మెల్యేని పిలిచి అగౌరపరచిన హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. పెద్దపంజాణి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన క్రీడా దినోత్సవానికి పాఠశాల హెచ్‌ఎం కేశవపిళ్లై స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. అయితే కార్యక్రమానికి వచ్చాక తనను పట్టించుకోకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేను పిలిచి అగౌరవపరడానికి కారణాలు తెలపాలంటూ హెచ్‌ఎంకు డీఈవో షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.  

Updated Date - 2021-09-04T05:15:03+05:30 IST