బెంగళూరులో నాటుతుపాకుల విక్రయం : పోలీసులకు పట్టుబడ్డ మదనపల్లెవాసి

ABN , First Publish Date - 2021-08-20T06:03:34+05:30 IST

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో నాటు తుపాకులు విక్రయిస్తూ మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అక్కడి పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

బెంగళూరులో నాటుతుపాకుల విక్రయం : పోలీసులకు పట్టుబడ్డ మదనపల్లెవాసి

మదనపల్లె క్రైం, ఆగస్టు 19: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో నాటు తుపాకులు విక్రయిస్తూ మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అక్కడి పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన గురువారం మదనపల్లెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదనపల్లె పట్టణ కదిరిరోడ్డుకు చెందిన మురళీవినోద్‌(47)స్థానికంగా ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తూ టీడీపీ కార్యకర్తగా కొనసాగుతున్నాడు. ఈనేపథ్యంలో  అతడు కొద్దిరోజులుగా బెంగళూరుకు చెందిన పలువురితో పరిచయాలు పెంచుకుని బీహార్‌ నుంచి నాటు తుపాకులు తీసుకొచ్చి బెంగళూరులో విక్రయిస్తున్నట్లు ఇటీవల అక్కడి పోలీసులు గుర్తించారు. దీనిపై నిఘా ఉంచిన పోలీసులు ఈనెల 11న మురళీవినోద్‌తో సహా నలుగురిని అరెస్ట్‌ చేసి రెండు నాటు తుపాకులు, ఐదు తూటాలు, ఐదు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురూ కొద్దిరోజులుగా నాటు తుపాకుల వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కర్ణాటక పోలీసులు తుపాకుల కేసులో మురళీవినోద్‌ను రిమాండుకు తరలించడంపై మదనపల్లెలో చర్చనీయాంశమైౖంది.

Updated Date - 2021-08-20T06:03:34+05:30 IST