పోలీసుల సహకారంతో మున్సిపల్‌ గదుల స్వాధీనం

ABN , First Publish Date - 2021-08-25T05:40:10+05:30 IST

మదనపల్లె పట్టణంలోని మున్సిపల్‌ గదులను అధికారులు మంగళవారం పో లీసుల సహకారంతో స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురాళ్లవంక, సీటీఎంరోడ్డు, బెంగళూరు, చిత్తూరు బస్టాండ్ల లోని 30 గదులకు సంబంధించి మున్సిపా లిటీకి లక్షల రూపాయలు బకాయిలున్నాయి

పోలీసుల సహకారంతో మున్సిపల్‌ గదుల స్వాధీనం
గదులను స్వాధీనం చేసుకుంటున్న అధికారులు

మదనపల్లె, ఆగస్టు 24: మదనపల్లె పట్టణంలోని మున్సిపల్‌ గదులను అధికారులు మంగళవారం పో లీసుల సహకారంతో స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురాళ్లవంక, సీటీఎంరోడ్డు, బెంగళూరు, చిత్తూరు బస్టాండ్ల లోని 30 గదులకు సంబంధించి మున్సిపా లిటీకి లక్షల రూపాయలు బకాయిలున్నాయి. వీటిని చెల్లించాలంటూ మున్సిపల్‌ అధికారులు ఇటీవల లీజుదారులకు నోటీసులు జారీ చేశారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గదులను స్వాధీనం చేసుకునే దిశగా అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతకుముందే వీటిలో కొన్ని గదులను వేలం నిర్వహించడానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీన్ని తెలుసుకున్న ఓ నాయకుడు తనకు తెలియకుండా వేలం ఎలా నిర్వహిస్తారని అధి కా రులను ప్రశ్నిస్తూ వేలంను రద్దు చేశాడు. తిరిగి వాటిని స్వాధీనం చేసుకునే క్రమంలో కమిషనర్‌ రఘునాథరెడ్డి పోలీసుల సహకారం తీసుకున్నారు. ఈక్రమంలో అధికారులు, లీజుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసుల రాజ్యమా అంటూ ప్రశ్నించారు. దీంతో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.  ఆర్వో పల్లవి, ఆర్‌ఐలు నాగరాజు, రెడ్డిమస్తాన్‌, శ్రీనివాసులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-25T05:40:10+05:30 IST