నత్తనడకన సచివాలయ భవన నిర్మాణాలు

ABN , First Publish Date - 2021-08-15T05:54:41+05:30 IST

మదనపల్లె మండలంలో సచివాలయ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మండలంలో 24 సచివాలయాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో భవనాన్ని రూ.40లక్షలతో నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే మండలంలో ఇప్పటి వరకు కేవలం బొమ్మనచెరువు సచివాలయం ఒకటి మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభమైంది.

నత్తనడకన సచివాలయ భవన నిర్మాణాలు
నిర్మాణదశలో ఉన్న కోళ్లబైలు గ్రామ సచివాలయం

నాలుగు ప్రాంతాల్ల్లో పునాదులు కూడా పడని వైనం


మదనపల్లె రూరల్‌, ఆగస్టు 14: మదనపల్లె మండలంలో సచివాలయ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మండలంలో 24  సచివాలయాల  నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది.  ఒక్కో భవనాన్ని రూ.40లక్షలతో  నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే మండలంలో ఇప్పటి వరకు కేవలం బొమ్మనచెరువు సచివాలయం ఒకటి మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభమైంది. కొత్తపల్లె, కొత్తిండ్లు, ఈశ్వరమ్మకాలనీ, వలసపల్లె  సచివాలయ భవనాలకు కనీసం పునాదులు కూడా పడలేదు. కొన్నిచోట్ల రెండు అంతస్తులు పూర్తి చేసుకోగా, మరికొన్ని చోట్ల గోడల వరకు నిర్మాణపనులు జరుగుతున్నాయి.   20 నెలల క్రితమే పనులు ప్రారంభించినా  నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.  కాంట్రాక్టర్లకు బిల్లులు ఆలస్యం కావడం కారణంగా తెలుస్తుంది. అదేవిధంగా పూర్తి చేసిన తరువాత బిల్లులు వస్తాయో రావో అనుమానం సైతం కాంట్రాక్టర్లలో ఉంది. కాగా కొన్నిచోట్ల సబ్‌ కాంట్రాక్టర్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు  సమాచారం. 

Updated Date - 2021-08-15T05:54:41+05:30 IST