టీటీడీ కాలేజీల్లో 18నుంచి రెండోవిడత అడ్మిషన్లు

ABN , First Publish Date - 2021-10-14T05:46:58+05:30 IST

టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీపద్మావతి మహిళా జూనియర్‌, ఎస్వీ జూనియర్‌ కళాశాలల్లో ఈనెల 18నుంచి 20వతేదీ సాయంత్రం ఐదు గంటల వరకు రెండోవిడత అడ్మిషన్లు చేపడుతున్నట్లు డీఈవో పేర్కొన్నారు.

టీటీడీ కాలేజీల్లో 18నుంచి రెండోవిడత అడ్మిషన్లు

తిరుపతి(విద్య), అక్టోబరు 13: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీపద్మావతి మహిళా జూనియర్‌, ఎస్వీ జూనియర్‌ కళాశాలల్లో ఈనెల 18నుంచి 20వతేదీ సాయంత్రం ఐదు గంటల వరకు రెండోవిడత అడ్మిషన్లు చేపడుతున్నట్లు డీఈవో పేర్కొన్నారు. మొదటవిడత పూర్తయ్యాక మిగిలిన ఖాళీసీట్లకు రెండోవిడతలో ప్రవేశాలకు ఎంపిక చేశామన్నారు. ఎంపికైన విద్యార్థుల సెల్‌ఫోన్‌కు ఈ సమాచారం పంపుతామని తెలిపారు. వివరాలు గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి టీటీడీ అడ్మిషన్స్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. విద్యార్థులు అడ్మిషన్లు పొందే సమయంలో అన్ని ఒరిజనల్‌ సర్టిఫికెట్లతోపాటు మూడుసెట్ల జెరాక్స్‌ కాపీలను వెంటతెచ్చుకోవాలని సూచించారు.   

Updated Date - 2021-10-14T05:46:58+05:30 IST