ఇంధనం పొదుపు చేయండి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-15T07:24:34+05:30 IST

ప్రజలు ఇంధనం పొదుపు చేయడం వల్లరాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని కల్టెర్‌ హరినారాయణన్‌ అన్నారు.

ఇంధనం పొదుపు చేయండి : కలెక్టర్‌
ఫ్లెక్సీలను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

తిరుపతి(ఆటోనగర్‌), డిసెంబరు 14 : ప్రజలు ఇంధనం పొదుపు చేయడం వల్లరాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని కల్టెర్‌ హరినారాయణన్‌ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఏపీ సదరన్‌ డిస్కం అధికారులు రూపొందించిన  జాతీయ ఇంధనం పొదుపు వారోత్సవాల ప్రచార  ఫ్లెక్సీలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ  మానవ జాతి మనుగడ కోసం ఇందనాన్ని పొదుపుగా ఉపయోగించాలన్నారు.  విద్యుత్‌ తిరుపతి సర్కిల్‌ ఎస్‌ఈ డి. వెంకటచలపతి, ఈఈలు ఎం కృష్ణారెడ్డి, వాసురెడ్డి, డీవై ఈఈలు రమేష్‌, బాబు, బాలాజీ, సతీష్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-15T07:24:34+05:30 IST