రైతుల నమ్మకమే సంగం డెయిరీ పెట్టుబడి
ABN , First Publish Date - 2021-10-28T05:31:49+05:30 IST
రైతుల నమ్మకమే పెట్టుబడిగా సంగం డెయిరీ నడు స్తోందని చైర్మన్ ధూళి పాళ్ల నరేంద్ర పేర్కొ న్నారు.బుధవారం మదన పల్లె మండలంలోని వలసపల్లె పంచాయతీ పుంగనూరురోడ్డులో ఉన్న సంగం డెయిరీ పాలశీతలీకరణ కేంద్రంలో పాడి రైతులకు బోనస్ చెక్కులు పంపిణీ చేశారు.

ధూళిపాళ్ల నరేంద్ర
మదనపల్లె రూరల్, అక్టోబరు 27: రైతుల నమ్మకమే పెట్టుబడిగా సంగం డెయిరీ నడు స్తోందని చైర్మన్ ధూళి పాళ్ల నరేంద్ర పేర్కొ న్నారు.బుధవారం మదన పల్లె మండలంలోని వలసపల్లె పంచాయతీ పుంగనూరురోడ్డులో ఉన్న సంగం డెయిరీ పాలశీతలీకరణ కేంద్రంలో పాడి రైతులకు బోనస్ చెక్కులు పంపిణీ చేశారు. వలసపల్లె పాలశీతలీకరణ కేంద్రంలో 3,300మంది రైతులకు రూ.3.40కోట్ల బోనస్ చెక్కులు పంపిణీ చేస్తు న్నామన్నారు. దీంతో పాటు రైతులకు 50శాతం రాయితీతో 600 చాప్‌కట్టర్లు, 150 మిల్కింగ్ మిషన్లు, 60 బ్రష్‌కట్టర్లు పంపిణీ అందిస్తున్నామన్నారు. పశువైద్యం, బీమా కల్పిస్తున్నామన్నారు.