షటిల్‌ ఆడుతూ కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్‌

ABN , First Publish Date - 2021-05-03T05:14:01+05:30 IST

దినచర్యలో భాగంగా ఒక ఆర్టీసీ డ్రైవర్‌ షటిల్‌ ఆడుతూ గుండెపోటుకు గురై కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు. ఈ సంఘటన పీలేరులో చోటు చేసుకుంది.

షటిల్‌ ఆడుతూ కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్‌
మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ తిమ్మయ్య

పీలేరు, మే2: దినచర్యలో భాగంగా ఒక ఆర్టీసీ డ్రైవర్‌ షటిల్‌ ఆడుతూ గుండెపోటుకు గురై కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు. ఈ సంఘటన పీలేరులో చోటు చేసుకుంది. పీలేరు ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్‌ తిమ్మయ్య(55) ఆదివారం ఉదయం 6.30గంటలకు స్థానిక ఆర్టీసీ డిపో కార్యాలయ ప్రాంగణంలో షటిల్‌ ఆడేందుకు వచ్చాడు. మ్యాచ్‌ ఆడుతూ ఛాతినొప్పిగా ఉందని కుప్పకూలిపోయాడు. అక్కడున్న కార్మికులు ఆయన్ను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా గతంలో ఈయనకు గుండెసమస్య తలెత్తడంతో స్టంట్‌ అమర్చినట్లు సహోద్యోగులు తెలియజేశారు. తిమ్మయ్య మృతిపై కార్మిక యూనియన్ల నాయకులు, కార్మికులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం  మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం సదుం మండలం బూరగమంద పంచాయతీ కురవపల్లెకి తరలించారు. 

Updated Date - 2021-05-03T05:14:01+05:30 IST