శ్రీవారి సేవలో ఆర్టీసీ చైర్మన్‌

ABN , First Publish Date - 2021-08-10T07:13:37+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని సోమవారం రాత్రి ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో ఆర్టీసీ చైర్మన్‌
ఆలయం ముందు మల్లికార్జునరెడ్డి

తిరుమల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని సోమవారం రాత్రి ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి దర్శించుకున్నారు. సాయంత్రం శ్రీవారిమెట్టు మార్గం ద్వారా కాలినడకన ఆయన తిరుమల చేరుకోగా టీటీడీ రిసెప్షన్‌ డిప్యూటీఈవో ఆర్‌1 లోకనాథం స్వాగతం పలికారు. తర్వాత శ్రీవారికి తలనీలాలు సమర్పించి రాత్రి నైవేద్య విరామ సమయంలో మూలమూర్తిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో మరోసారి ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆయన వెంట ఆర్టీసీ ఈడీ గోపినాథరెడ్డి, ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి, డీవీఎం గిరిధర్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2021-08-10T07:13:37+05:30 IST