ఉదయం 6నుంచి 12వరకే ఆర్టీసీ బస్సులు
ABN , First Publish Date - 2021-05-05T06:46:38+05:30 IST
కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన సందర్భంగా ఆర్టీసీ సర్వీసులకు కూడా ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే నడపనున్నారు.

చెన్నై, హైదరాబాదు, విజయవాడ వంటి దూరప్రాంతాలకు రద్దు
తిరుమలకు యథావిధిగా సర్వీసులు
తిరుపతి(రవాణా), మే 4: కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన సందర్భంగా ఆర్టీసీ సర్వీసులకు కూడా ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే నడపనున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి బెంగళూరుకు సర్వీసులను పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అలాగే చెన్నై, పుదుచేరి, వేలూరు, కంచి ప్రాంతాలతోపాటు హైదరాబాదు వంటి దూరప్రాంతాలకు బుధవారం నుంచి సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ, కర్నూలు వంటి ప్రాంతాలకు బస్సులు ఉండవు. దగ్గరప్రాంతాలకు మాత్రమే నడవనున్నాయి. ఉదయం ఆరు గంటలకు బస్టాండు నుంచి బస్సులు బయల్దేరి మధ్యాహ్నం 12గంటలకు ఆయా డిపోలకు చేరుకునేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. తిరుపతి - తిరుమలకు మాత్రం యథావిధిగా బస్సులు నడుస్తాయని ఆర్‌ఎం చెంగల్‌రెడ్డి తెలిపారు.