ఆర్టీసీ బోర్డు ఉపాధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2021-10-19T06:53:51+05:30 IST

ఆర్టీసీ బోర్డు రాష్ట్ర ఉపా ధ్యక్షుడిగా ఎం.సి. విజయానందరెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఆర్టీసీ బోర్డు ఉపాధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని సన్మానిస్తున్న విజయానందరెడ్డి దంపతులు

చిత్తూరు, అక్టోబరు 18: ఆర్టీసీ బోర్డు రాష్ట్ర ఉపా ధ్యక్షుడిగా ఎం.సి. విజయానందరెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాలులో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి బోర్డు రాష్ట్ర చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఏపీ మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుల్లెట్‌ సురేష్‌, ఏపీ విద్య, సంక్షేమ అభివృద్ధి కమిటీ డైరెక్టర్‌ ధీరజ్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకముంచి, ఈ పదవిని ఇచ్చిన సీఎం జగన్‌కు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. 

Updated Date - 2021-10-19T06:53:51+05:30 IST