తిరుపతి బస్టాండులో రూ.60 లక్షలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-11-02T07:14:09+05:30 IST

తిరుపతి ఆర్టీసీ బస్టాండులో ఇద్దరు అనుమానితుల నుంచి పోలీసులు రూ.60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

తిరుపతి బస్టాండులో రూ.60 లక్షలు స్వాధీనం
పట్టుబడిన డబ్బు చూపుతూ వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మురళీకృష్ణ

పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు


తిరుపతి(నేరవిభాగం), నవంబరు 1: తిరుపతి ఆర్టీసీ బస్టాండులో ఇద్దరు అనుమానితుల నుంచి పోలీసులు రూ.60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపిన ప్రకారం.. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి, సిబ్బందితో కలిసి డీఎస్పీ సోమవారం రాత్రి ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండులో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన మురళి, భూపతిని తనిఖీ చేయగా వారి వద్ద రూ.60 లక్షలు లభ్యమయ్యాయి. తాము కొర్లగుంట వీధిలోని కామాక్షి నగల దుకాణంలో పనిచేస్తున్నామని, చెన్నైలో నగలు కొనేందుకు నగదు తీసుకెళ్తున్నట్టు వారు చెప్పారు. ఆ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు వారివద్ద లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. మురళి, భూపతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-11-02T07:14:09+05:30 IST