రూ.5.30 లక్షల బాణసంచా సీజ్‌

ABN , First Publish Date - 2021-10-30T05:07:08+05:30 IST

అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5.30లక్షల విలువైన బాణసంచాను ఏర్పేడు పోలీసులు సీజ్‌ చేశారు.

రూ.5.30 లక్షల బాణసంచా సీజ్‌
సీజ్‌ చేసిన బాణసంచాతో పోలీసులు

ఏర్పేడు, అక్టోబరు 29: అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5.30లక్షల విలువైన బాణసంచాను పోలీసులు సీజ్‌ చేశారు. మండలంలోని పల్లం గ్రామానికి చెందిన పన్నీరుసెల్వం అక్రమంగా బాణసంచా నిల్వ ఉంచినట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ శ్రీహరి సిబ్బందితో కలసి దాడులు జరిపి బాణసంచాను సీజ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. దాడుల్లో ఎస్‌ఐ రఫి, హెడ్‌ కానిస్టేబుల్‌ రజాక్‌, పీసీలు బుజ్జిబాబు, సుమన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T05:07:08+05:30 IST