అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
ABN , First Publish Date - 2021-12-09T08:00:57+05:30 IST
తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.10 లక్షలు విరాళంగా అందింది.

తిరుమల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.10 లక్షలు విరాళంగా అందింది. చిత్తూరుకు చెందిన రాజేంద్రప్రసాద్ ఈ విరాళానికి సంబంధించిన డీడీని తిరుమలలోని దాతల విభాగంలో అందజేశారు.
శ్రీవారికి విరాళంగా అందనున్న 5.5 కిలోల బంగారు ఆభరణాలు?
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి గురువారం 5.5 కిలోల బంగారు ఆభరణాలు విరాళంగా అందనున్నట్టు సమాచారం. దాదాపు రూ.3.5 కోట్ల విలువైన కఠి, వరద హస్తాలను శ్రీవారికి ఆజ్ఞాత భక్తులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వీటిని శుక్రవారం అభిషేక సేవ తర్వాత శ్రీవారికి అలంకరించనున్నట్టు సమాచారం.