రేపు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష

ABN , First Publish Date - 2021-06-22T06:29:04+05:30 IST

జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై బుధవారం ఉదయం 11 గంటలకు స్థానిక జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాలులో సమావేశం జరుగుతుందని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

రేపు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష

హాజరుకానున్న డిప్యూటీ సీఎం, మంత్రి


చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 21: జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై బుధవారం ఉదయం 11 గంటలకు  స్థానిక జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాలులో సమావేశం జరుగుతుందని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. గృహ నిర్మాణ పథకం, ఆర్‌బీకేలు, సచివాలయాలు, వైఎస్సార్‌ అర్బన్‌, రూరల్‌ హెల్త్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలు, బీఎంసీయూల నిర్మాణాలపై సమీక్షిస్తారన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీరాజ్‌శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-22T06:29:04+05:30 IST