సచివాలయంలో వేలంపాటలు

ABN , First Publish Date - 2021-05-30T06:38:52+05:30 IST

రేణిగుంట పంచాయతీకి వేలం పాటల ద్వారా 29 లక్షల రూపాయల ఆధాయం సమకూరింది

సచివాలయంలో వేలంపాటలు
వేలంపాటలు నిర్వహిస్తున్న అధికారులు

రేణిగుంట, మే 29: స్థానిక సచివాలయ ఆవరణలో శనివారం బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. ఆ మేరకు వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్‌, బస్టాండ్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల వేలం పాటల్లో రూ.29 లక్షల ఆదాయం వచ్చినట్లు సచివాలయ కార్యదర్శి రమే్‌షచంద్రబాబు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈమారు వేలంలో రూ.లక్ష ఆదాయం తగ్గినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నగేష్‌, ఈవోపీఆర్డీ నీలంకంఠేశ్వరరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శివరామరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-30T06:38:52+05:30 IST