కాలువ ఆక్రమణలు తొలగించండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-08T07:06:09+05:30 IST

వరద ఉధ్రుతితో జీవగ్రామం ముంపునకు గురైన ఘటనలో కాలువల ఆక్రమణలు తొలగించాలని చిత్తూరు కలెక్టర్‌ ఆదేశించారు.

కాలువ ఆక్రమణలు తొలగించండి: కలెక్టర్‌
జీవగ్రామం ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్‌

రేణిగుంట, డిసెంబరు 7: వరద ఉధ్రుతికి మండలంలోని గాజుమండ్యం పంచాయతీ జీవగ్రామం ముంపునకు గురైంది. కుర్రకాలువ, ఎలమండ్యం కాలువల ఆక్రమణతో ఈ సమస్యలు రావడంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన కలెక్టర్‌ హరినారాయణన్‌ మంగళవారం కేఎల్‌ఎం ఆస్పత్రి ప్రాంతంలో కాలువలను పరిశీలించారు. జీవగ్రామం ప్రజలతో మాట్లాడిన ఆయన వెంటనే కాలువ ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక ఫ్యాక్టరీల నుంచి వచ్చే కలుషిత నీటి కంపు భరించలేకున్నామని స్థానికులు వాపోయారు. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం జీపాళెం, పద్మానగర్‌, ఆర్‌.మల్లవరం, ఎస్టీకాలనీ, గుత్తివారిపల్లె హరిజనవాడ, వెదళ్లచెరువు ఎస్టీకాలనీల్లో ఆయన పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కనకనరసారెడ్డి, తహసీల్దార్‌ శివప్రసాద్‌, ఎంపీడీవో హరిబాబు, డీటీ ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T07:06:09+05:30 IST