పెరియంబాడి సర్పంచ్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ

ABN , First Publish Date - 2021-02-02T05:17:53+05:30 IST

ఎమ్మెల్సీ దొరబాబు తీసుకొచ్చి పెరియంబాడి పంచాయతీకి నామినేషన్‌ వే యించిన కుమారి నామినేషన్‌ స్కూృట్నీలో తిరస్కరణకు గురైంది.

పెరియంబాడి సర్పంచ్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ

యాదమరి, ఫిబ్రవరి 1: నామినేషన్‌ దాఖలు చేయడానికి చివరిరోజైన ఆదివారం అనూహ్యంగా చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల అనంతరం ఎమ్మెల్సీ దొరబాబు తీసుకొచ్చి పెరియంబాడి పంచాయతీకి నామినేషన్‌ వే యించిన కుమారి నామినేషన్‌ స్కూృట్నీలో తిరస్కరణకు గురైంది. నామినేషన్‌ పత్రంలో సాక్షి సంతకం చేసిన దిలీప్‌కు సదరు పంచాయతీలో ఓటు లేనికారణంగా నామినేషన్‌ తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. తిరస్కరణపై అభ్యంతరం ఉంటే అప్పీల్‌ చేసుకోవచ్చని ఆర్‌వో తెలిపారు.

Updated Date - 2021-02-02T05:17:53+05:30 IST