ఎర్రచందనం స్మగ్లింగ్‌ ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2021-10-25T07:40:03+05:30 IST

శేషాచలం అడవుల నుంచి చెన్నైకి ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠాను తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ ముఠా అరెస్టు
ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

11 దుంగలు, ఆరు వాహనాల స్వాధీనం


తిరుపతి(కపిలతీర్థం), అక్టోబరు 24: శేషాచలం అడవుల నుంచి చెన్నైకి ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠాను తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వివరాలను టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో ఎస్పీ మేడా సుందరరావు మీడియాకు తెలిపారు. డీఐజీ క్రాంతి రాణా టాటా నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్‌కు అందిన సమాచారంతో ఆర్‌ఐ సురేష్‌ కుమార్‌ రెడ్డి, ఆర్‌ఎ్‌సఐ సురేష్‌ బృందాలు ఆదివారం వేకువజామున పుత్తూరు మార్గంలో కూంబింగ్‌ నిర్వహించాయి. వడమాలపేట మండలం అంజేరమ్మ కనుమ వద్ద రెండు బైకులపై వస్తున్న వారిని ఆపి, విచారిస్తుండగా వెనుకనే వరుసగా మినీ వ్యాను, కారు వచ్చా యి. వాటిని ఆపి, తనిఖీ చేయగా వ్యానులో 11 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఆ వెనుకనే మరో రెండు మోటరు సైకిళ్లపై వస్తున్న వారిని ఆప గా వారు కూడా ఇదే ముఠా సభ్యులని తేలింది. దాంతో ఆరుగురు స్మగ్లర్ల ముఠాను అరెస్టు చేసి, ఆరు వాహనాలు, 11 ఎర్రచందనం దుంగలను స్వాధీ నం చేసుకున్నారు. పట్టుబడ్డ వారంతా తమిళనాడువాసులుగా గుర్తించారు. వీరిలో.. తమిళనాడు రాష్ట్రంలోని శీర్గాళికి చెందిన బాలసుబ్రహ్మణ్యం (29), తిరువళ్లూరు జిల్లా పాకాశాలైకు చెందిన జె.శరవణన్‌ (34), పల్లిపట్టుకు చెందిన ఎన్‌.రమే్‌ష(47), ఎస్‌ఎం సంజీవి (27), సి.రాంకీ (29), చెన్నై తిరువేర్కాడుకు చెందిన  ఎ.శ్రీజిత్‌ (43) ఉన్నారు. ఈ కేసును సీఐ చంద్రశేఖర్‌ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సమావేశంలో డీఎస్పీ మురళీధర్‌, ఆర్‌ఐ సురేష్‌ కుమార్‌ రెడ్డి, సీఐ చంద్రశేఖర్‌, ఎఫ్‌ఆర్‌వో ప్రసాద్‌, ఎస్‌ఐ మోహన్‌ నాయక్‌, ఆర్‌ఎ్‌సఐలు సురేష్‌, వినోద్‌ కుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T07:40:03+05:30 IST