15 వరకు లైఫ్ సర్టికెట్ల స్వీకరణ
ABN , First Publish Date - 2021-03-24T05:32:57+05:30 IST
వివిధ జిల్లాల పెన్షనర్ల సంఘాల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 15వరకు పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను అందజేసేందుకు ప్రభుత్వం గడువు పొడిగించిందని జిల్లా ఖజానా శాఖ డీడీ గంగాద్రి మంగళవారం మీడియాకు తెలిపారు.

ఖజానా డీడీ గంగాద్రి
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 23: వివిధ జిల్లాల పెన్షనర్ల సంఘాల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 15వరకు పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను అందజేసేందుకు ప్రభుత్వం గడువు పొడిగించిందని జిల్లా ఖజానా శాఖ డీడీ గంగాద్రి మంగళవారం మీడియాకు తెలిపారు. గతంలో సర్టిఫికెట్ల స్వీకరణకు ఫిబ్రవరి 28 చివరి తేదీ కాగా, కొవిడ్ దృష్ట్యా పలువురు పెన్షనర్లు గడవు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆ మేరకు వారు లైఫ్ సర్టిఫికెట్లను ఎస్టీవో కార్యాలయంలో గాని, జీవన్ ప్రమాణ్ ద్వారా ఏప్రిల్ 15లోగా పంపుకోవాలని చెప్పారు.