నేటి నుంచి అర్బన్‌లో రేషన్ పంపిణీ
ABN , First Publish Date - 2021-02-01T06:17:10+05:30 IST
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో సోమవారం నుంచి మొబైల్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ మార్కండేయులు తెలిపారు.

చిత్తూరు కలెక్టరేట్, జనవరి 31: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో సోమవారం నుంచి మొబైల్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్ మార్కండేయులు తెలిపారు. ఆదివారం చిత్తూరు మండల గోడౌన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 123 వాహనాల ద్వారా 1.92 లక్షల కార్డులకు రేషన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సివిల్ సఫ్లయిస్ డీఎం సోమయాజులు, డీఎస్వో శివరామప్రసాద్, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని జిల్లా ఖజానా స్ర్టాంగ్ రూమ్‌ను కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. ముద్రించి స్ర్టాంగ్‌రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్ పత్రాలను పరిశీలించారు. ఆయన వెంట జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీపీవో దశరథరామిరెడ్డి ఉన్నారు.
సీఎస్ డీటీ సస్పెన్షన్
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న చిత్తూరు మండల సీఎ్‌సడీటీ రుషి వర్మను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఇన్‌చార్జి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గోదాము తనిఖీ చేస్తున్నప్పుడు సీఎ్‌సడీటీ గైర్హాజరు అవ్వడం పట్ల ఇన్‌చార్జి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు ఆలస్యంగా రావడంపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు.