పునరావాస కేంద్రాలకు వాన బాధితులు

ABN , First Publish Date - 2021-11-22T05:22:27+05:30 IST

జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలతో పాటు వర్షాల కారణంగా ఇళ్లు దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కూడా పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి విజ్ఞప్తి చేశారు.

పునరావాస కేంద్రాలకు వాన బాధితులు

చిత్తూరు(సెంట్రల్‌), నవంబరు 21: జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలతో పాటు వర్షాల కారణంగా ఇళ్లు దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కూడా పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా పడమటి మండలాల్లో పలు ఇళ్లు దెబ్బతినడమే కాకుండా చాలా నివాస గృహాలు ఉరుస్తున్నాయన్నారు. ప్రమాదకర స్థితిలో ఉన్న ఇళ్లలోని ప్రజలు సమీపంలోని పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులపై దృష్టి సారించాలన్నారు.

Updated Date - 2021-11-22T05:22:27+05:30 IST