అరాచకాన్ని ప్రశ్నిస్తే దాడులా?

ABN , First Publish Date - 2021-10-22T05:26:50+05:30 IST

తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని ప్రశ్నిస్తే, టీడీపీ నేతల పైనే దాడులు చేయడమే కాకుండా కేసులు పెట్టడం ఏమిటని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌.ఎం.పర్వీన్‌తాజ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అరాచకాన్ని ప్రశ్నిస్తే దాడులా?
మీడియాతో మాట్లాడుతున్న పర్వీన్‌తాజ్‌

టీడీపీ నేత పర్వీన్‌తాజ్‌ ధ్వజం


పట్టాభిని బేషరతుగా విడుదల చేయాలి: ఆర్జే వెంకటేష్‌


బి.కొత్తకోట, అక్టోబరు 21: తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని ప్రశ్నిస్తే, టీడీపీ నేతల పైనే దాడులు చేయడమే కాకుండా కేసులు పెట్టడం ఏమిటని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌.ఎం.పర్వీన్‌తాజ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బి.కొత్తకోటలోని ఆమె నివాసంలో గురవారం మీడి యాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుండగా, సీఎం జగన్‌రెడ్డి పోలీస్‌ బాస్‌గా వ్య వహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దాడి చేసిన వైసీపీ గుండాలను వదిలేసి, తమ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్టు చేయడంపై మండిపడ్డారు. పట్టాభికి ఏమైనా జరిగే, సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగై, అరాచక పాలన నడుస్తోందని చెప్పడానికి ఇది ఉదాహరణ అన్నారు. రాష్ట్రంలో ఆర్టి కల్‌ 356 విధించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.మొటుకు శివ, డేరింగుల నారాయణ, చావిడి కిట్టన్న, రవికుమార్‌, శిల్పా ఆంజి, మస్తాన్‌రెడ్డి, గట్టు చంద్రన్న, సీనప్ప, శంకర్‌, అశోక్‌, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.





మదనపల్లె టౌన్‌: రాష్ట్రంలో గంజాయి సాగవు తోందని ప్రశ్నించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిఽధి పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను బేషర తుగా విడుదల చేయాలని రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు.నిమ్మనపల్లె సర్కిల్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో  విశాఖలో గంజాయి స్మగ్లింగ్‌పై దాడి చేసేందుకు వస్తే తెలంగాణ పోలీసులపై స్మగ్లర్లు కాల్పులు జరి పారన్నారు. ఓ ప్రజాప్రతినిధి కుమారుడు హెరా యిన్‌ స్మగ్లింగ్‌ ఆరోపణలు వస్తే ఆ కేసు అతీగతి లేదన్నారు. నెల్లూరులో కూడా తమిళనాడు పోలీ సులపై కాల్పులు జరిపిన విషయం మరచిపోరా దన్నారు. ఇంత జరుగుతున్నా ఇక్కడి పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా ప్రభుత్వ అండదండలతోనే జరుగుతోందని పట్టాభి ప్రశ్నిస్తే... ఆయన ఇంటిపై   దాడులు చేయించారన్నారు. పోలీసులు కూడా కుమ్మక్కయ్యారంటే ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ పెద్దల కుట్రతోనే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దా డులు జరిగాయన్నారు. దీనిపై టీడీపీ బంద్‌కు పి లు పునిస్తే  నాయకులందరినీ గృహనిర్బంధం చేశారు. అదే వైసీపీ నాయకులు దీక్షలు చేస్తుంటే  యఽథే చ్ఛగా వదిలేశారన్నారు. రాష్ట్రంలో రావణ కాష్టం రగిల్చి ఆ మంటల్లో జగన్‌ చలి కాచుకుంటున్నా డన్నారు.  పార్లమెంటరీ తెలుగు మహిళ  ప్రధాన కార్యదర్శి విజయమ్మ, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:26:50+05:30 IST