వర్చువల్‌ పద్ధతిలో రేపు పుంగనూరు ఆర్టీసీ డిపో ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-05T06:14:32+05:30 IST

ఈ నెల 6వ తేదీన వర్చువల్‌ పద్ధతిలో సీఎం జగన్‌ , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పురంగనూరు ఆర్టీసీ డిపోను ప్రారంభిస్తారని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

వర్చువల్‌ పద్ధతిలో రేపు పుంగనూరు ఆర్టీసీ డిపో ప్రారంభం
ఆర్టీసీ డిపో పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

పుంగనూరు రూరల్‌, మే 4: ఈ నెల 6వ తేదీన వర్చువల్‌ పద్ధతిలో సీఎం జగన్‌  , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  పురంగనూరు ఆర్టీసీ డిపోను ప్రారంభిస్తారని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. మదనపల్లె సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ చెంగల్‌రెడ్డితో కలసి మంగళవారం  పుంగనూరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఏపీఎ్‌సఆర్టీసీ డిపో పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపోలో ఏర్పాటు చేస్తున్న శిలాఫలకాలు, ప్రారంభం చేసే సమయంలో 50మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పుంగనూరు నుంచి బస్సులు ఏ ప్రాంతాలకు వెళుతాయని ఆర్‌ఎంను అడిగితెలుసుకున్నారు. ప్రస్తుతం 66 సర్వీసులు అందబాటులో ఉన్నట్లు వివరించారు.  పుంగనూరు నుంచి తిరుమల, తిరుపతి, హైదరాబాదు, చెన్నై, విజయవాడ, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, కడప, రాయచోటి, కదిరి, బెంగళూరు, ముళబాగళ్‌, పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్సులు వెళుతాయని తెలిపారు. ఆయన వెంట ఆర్టీసీ డివిజనల్‌ మేనేజర్‌ భాస్కర్‌రెడ్డి, మేనేజర్‌ సుధాకర్‌, తహసీల్దార్‌ వెంకట్రాయులు, ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-05T06:14:32+05:30 IST