పోలీస్‌ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ బదిలీ

ABN , First Publish Date - 2021-01-12T06:21:15+05:30 IST

తిరుపతి పోలీస్‌ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ కె.సూర్యభాస్కర్‌ రెడ్డి బదిలీ అయ్యారు.

పోలీస్‌ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ బదిలీ

కలికిరి, జనవరి 11: తిరుపతి పోలీస్‌ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ కె.సూర్యభాస్కర్‌ రెడ్డి బదిలీ అయ్యారు. ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో అడిషనల్‌ ఎస్పీ కేడర్‌లో ఆయన ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు. సూర్యభాస్కర్‌ రెడ్డిని మంగళగిరి ఇంటిలిజెన్స్‌లోని సెక్యూరిటీ విభాగంలో ఏఎస్పీ కేడర్‌లోనే నియమించారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2021-01-12T06:21:15+05:30 IST