పాఠశాలల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం: ఏఎంవో
ABN , First Publish Date - 2021-12-15T06:40:56+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సమగ్ర శిక్ష జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శివశంకర్ సూచించారు.

శ్రీకాళహస్తి, డిసెంబరు 14: ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సమగ్ర శిక్ష జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్(ఏఎంవో) శివశంకర్ సూచించారు. మంగళవారం శ్రీకాళహస్తి మండలం టీఎంవీకండ్రిగ పాఠశాలను మంగళ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీ లించిన ఆయన మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలిం చారు. మెనూ మేరకు భోజనం అందజేయాలని టీచర్లకు గుర్తుచేశారు. విద్యార్థుల హాజరు 75శాతం ఉంటేనే అమ్మఒడి పథక లబ్ధి అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం జి.వి.విజయలక్ష్మి, సీఆర్పీ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.