మెడికల్‌ కిట్ల వితరణ

ABN , First Publish Date - 2021-07-24T06:41:10+05:30 IST

ప్రగతి సంస్థ సభ్యులు మెడికల్‌ కిట్లను వితరణగా ఇచ్చారు.

మెడికల్‌ కిట్ల వితరణ
మెడికల్‌ కిట్లు అందజేస్తున్న ప్రగతి సంస్థ సిబ్బంది

ఏర్పేడు, జూలై 23: మండలంలోని బండారుపల్లె సబ్‌సెంటర్‌, చిందేపల్లె, జంగాలపల్లె, పాతవీరాపురం, నచ్చనేరి అంగన్‌వాడీ సెంటర్లకు శుక్రవారం ప్రగతి సంస్థ సభ్యులు మెడికల్‌ కిట్లను వితరణగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ సంస్థ మండల కో-కన్వీనర్‌ రామచంద్ర మాట్లాడుతూ... క్రై సంస్థ సహకారంతో తమ వంతు సాయం చేస్తున్నామని చెప్పారు. మెడికల్‌ కిట్‌లో మాస్కులు, మందులు, పల్స్‌ఆక్సీమీటర్‌, బీపీ మానిటర్‌, థర్మామీటర్‌ ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జీవిత, అంగన్‌వాడీ సిబ్బంది పూర్ణ, బత్తెమ్మ, ధనమ్మ, సచివాలయ సిబ్బంది శిరీష, నిహారిక, సుబ్రహ్మణ్యం, వైద్య సిబ్బంది అభినందన, ఆశ, ధనలక్ష్మి, మల్లీశ్వరి, సుజాత పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T06:41:10+05:30 IST