జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఎన్నికల వాయిదా

ABN , First Publish Date - 2021-07-12T06:30:16+05:30 IST

శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ నూతన కార్యవర్గ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ సంస్థ ఈవో డాక్టర్‌ పి.బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఎన్నికల వాయిదా

తిరుపతి(విద్య) జూలై 11: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ నూతన కార్యవర్గ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ సంస్థ ఈవో డాక్టర్‌ పి.బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకు ఆదివారం చైర్మన్‌, 11మంది కార్యవర్గ సభ్యుల ఎంపికకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇంతకుముందు పనిచేసిన ఆ సంస్థ చైర్మన్‌ తిరుమలనాఽథ్‌ తమను రెండోసారి కొనసాగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాలో ఇంతకుముందు పనిచేసిన చైర్మన్‌లనే మళ్లీ కొనసాగించేలా ఉత్తర్వులు ఇచ్చారని, అదే విధంగా తనకు కూడా రెండో దఫా అవకాశం కల్పించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా వేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. 

Updated Date - 2021-07-12T06:30:16+05:30 IST