ఆరు డీఎస్పీ పోస్టుల భర్తీ
ABN , First Publish Date - 2021-02-07T05:12:17+05:30 IST
ఖాళీగా ఉన్న ఆరు డీఎస్పీ పోస్టులను భర్తీ చేస్తూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు వెలువరించారు.

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 6: ఖాళీగా ఉన్న ఆరు డీఎస్పీ పోస్టులను భర్తీ చేస్తూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు వెలువరించారు. ఇప్పటివరకు ఎక్కడా పోస్టింగ్ లేకుండా వేకెన్సీ ఫర్ రిజర్వులో ఉన్నవారిని ఈ స్థానాల్లో నియమించారు. తిరుపతి అర్బన్‌జిల్లాలో ఐదు డీఎస్పీ స్థానాలను, చిత్తూరు పోలీసు జిల్లాలో ఓ స్థానాన్ని భర్తీ చేశారు. వి.పోతురాజు చిత్తూరు రెడ్‌శాండిల్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీగా నియమితులయ్యారు. తిరుపతి అర్బన్ పరిధిలో.. ఎస్బీ-1, ఎస్బీ-2 డీఎస్పీలుగా ఎస్.కె.చంద్రశేఖర్, ఎం.వి.రమణ, ఎస్సీ, ఎస్టీ సెల్-2కు యు.సూర్యనారాయణ, తిరుమల సీసీఎస్ డీఎస్పీగా ఎల్.సుధాకర్, ఆర్‌ఎస్‌ఏఎఫ్‌టీఎస్ డీఎస్పీగా డి.మురళీధర్‌ను నియమించారు. వీరంతా తక్షణం బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.