చంద్రబాబు ఇంటికి బందోబస్తు
ABN , First Publish Date - 2021-10-20T06:30:39+05:30 IST
రాష్ట్రంలో పలుచోట్ల మంగళవారం టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణుల దాడుల నేపథ్యంలో పోలీసులు స్పందించారు.

చంద్రగిరి, అక్టోబరు 19: రాష్ట్రంలో పలుచోట్ల మంగళవారం టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణుల దాడుల నేపథ్యంలో పోలీసులు స్పందించారు. చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడా దాడులు జరగతాయన్న అనుమానంతో పోలీసులు కాపలా ఉన్నారు.