12 సింగిల్‌ విండోలకు పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలు

ABN , First Publish Date - 2021-05-03T04:10:38+05:30 IST

ఇది వరకు నియమించిన త్రిసభ్య కమిటీల పాలకవర్గాల గడువు గతనెల 30వ తేదీతో ముగియడంతో ప్రభుత్వం జిల్లాలోని 12 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల( సింగిల్‌ విండోలు)కు అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలను నియమించింది.

12 సింగిల్‌ విండోలకు పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలు

చిత్తూరు కలెక్టరేట్‌, మే 2: ఇది వరకు నియమించిన త్రిసభ్య కమిటీల పాలకవర్గాల గడువు గతనెల 30వ తేదీతో ముగియడంతో ప్రభుత్వం జిల్లాలోని 12 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల( సింగిల్‌ విండోలు)కు అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర సహకార శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పులిచెర్ల, నిండ్ర, చిన్నగొట్టిగల్లు, బైరెడ్డిపల్లె, పుంగనూరు, సదుం, సోంపల్లె, కోసలనగరం, అగరం రామకృష్ణ, బయ్యప్పగారిపల్లె, సత్యవేడు, పెనుమూరు సొసైటీలకు అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిలుగా సహకార శాఖకు చెందిన అసిస్టెంట్‌ రిజిస్ర్టార్లు, సీనియర్‌ ఇన్స్‌పెక్టర్లను నియమించారు. వీరి పదవీకాలం అక్టోబరు 31వ తేదీ వరకు కొనసాగుతుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

Updated Date - 2021-05-03T04:10:38+05:30 IST