పాడిరైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి

ABN , First Publish Date - 2021-10-30T05:05:07+05:30 IST

పశు పోషణలో పాడిరైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని తిరుపతి వెటర్నరీ వర్సిటీ డీన్‌ సర్జన్‌రావు పేర్కొన్నారు.

పాడిరైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న సర్జన్‌రావు

ఏర్పేడు, అక్టోబరు 29: పశు పోషణలో పాడిరైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని తిరుపతి ఎస్వీ వెటర్నరీ వర్సిటీ డీన్‌ సర్జన్‌రావు పేర్కొన్నారు. మండలంలోని మన్నసముద్రంలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ పాడిరైతులకు పశు పోషణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పందుల పెంపకం కూడా లాభసాటిగా ఉంటుందని సూచించారు. ప్రిన్సిపాల్‌ ఆదిలక్ష్మమ్మ మాట్లాడుతూ... కోళ్ల పెంపకం చేపట్టడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. ఫిషరీస్‌ డీన్‌ ఏఆర్‌కేరెడ్డి చేపల పెంపకం, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వనజ, అధ్యాపకులు రాంబాబు, నవీన్‌, కల్యాణ్‌, షకీల, పశు వైద్యాధికారి శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:05:07+05:30 IST