తిరుపతిలో సౌత్‌ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-07-05T06:39:46+05:30 IST
తిరుపతిలో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ఆదివారం వైభవంగా ప్రారంభమైంది.
తక్కువ ధరల్లో 4లక్షలకుపైగా మెన్స్, ఉమెన్స్, కిడ్స్‌వేర్ వెరైటీలు
తిరుపతి(రవాణా), జూలై 4: తిరుపతిలో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. నగరంలోని పాత శ్రీనివాస థియేటర్ ప్రదేశంలో ఏర్పాటు చేసిన 24వ షోరూమ్‌ను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్‌మాల్ డైరెక్టర్లు సురేష్‌సీర్ణ, అభినవ్, రాకేష్, కేశవ్ మాట్లాడుతూ.. షోరూమ్ నెలకొల్పిన ప్రతి ప్రాంతంలో తమ సంస్థకు ప్రజాదరణ లభిస్తోందన్నారు. ఈ విశేష ఆదరణను పురస్కరించుకుని ఆకర్షణీయమైన సరికొత్త వస్త్ర, ఆభరణ శ్రేణిని ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలతో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ దక్షిణ భారతదేశంలో అగ్రశ్రేణి రీటైల్ బ్రాండ్‌గా అత్యున్నత స్థాయికి ఎదిగిందన్నారు. అన్నివర్గాల జీవనశైలిని ప్రతిబింబిస్తూ సరసమైన రీటైల్ ధరల్లో వస్త్రాభరణాలను అందిస్తున్నామని తెలియజేశారు. తిరుపతిలో ప్రారంభించిన షోరూమ్‌లో రూ.150 ప్రారంభ ధరతో నాలుగు లక్షలకుపైగా మెన్స్, ఉమెన్స్, కిడ్స్‌వేర్ వెరైటీలు అందుబాటులో ఉన్నాయన్నారు. కంచి, ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి సరికొత్త డిజైన్లు, కోయంబత్తూరు, బెంగళూరు, కేరళ, సల్వార్‌సూట్లు, లెహంగాస్, లెగ్గిన్స్, కిడ్స్‌వేర్, మెన్స్ ఎత్నిక్ వేర్, సూటింగ్స్, షర్టింగ్స్‌లో అగ్రగామిగా ఉన్నామన్నారు. తక్కువ ధరల్లో ఎక్కువ వెరైటీలను అందిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.