ఆన్‌లైన్‌ పాలసీ విక్రయాలు నిషేధించాలి

ABN , First Publish Date - 2021-03-24T05:36:46+05:30 IST

ఎల్‌ఐసీ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించిన పాలసీల విక్రయ ప్రక్రియను నిషేధించాలని కోరుతూ మంగళవారం పలువురు ఏజెంట్లు ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

ఆన్‌లైన్‌  పాలసీ విక్రయాలు నిషేధించాలి
ఎల్‌ఐసీ ఎదుట ధర్నా చేస్తున్న ఏజెంట్లు

 చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 23: ఎల్‌ఐసీ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించిన పాలసీల విక్రయ ప్రక్రియను నిషేధించాలని కోరుతూ మంగళవారం పలువురు ఏజెంట్లు ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఏజెంట్ల కడుపుకొట్టేలా యాజమాన్యం ఆన్‌లైన్‌ అమ్మకాల సేవలు ప్రారంభించడం బాధాకరమన్నారు. పాలసీదారులకు ఇస్తున్న బోనస్‌ను మరింత పెంచాలని, ఏజెంట్లందరికి గ్రాడ్యుటీ, టర్మ్‌ ఇన్సురెన్స్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో చిత్తూరు ఎల్‌ఐసీ ఏజెంట్ల సంఘం అధ్యక్షులు కె. బాలకృష్ణనాయుడు, కార్యదర్శి ఎస్‌.శివకుమార్‌, సభ్యులు గిరిధర్‌రెడ్డి, టి. రాజారెడ్డి, కె.రామమూర్తి, బి.గోపి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-24T05:36:46+05:30 IST