వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యం: జేసీ
ABN , First Publish Date - 2021-10-30T05:03:39+05:30 IST
వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా వైద్య, సచివాలయ సిబ్బంది పనిచేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు.

తొట్టంబేడు, అక్టోబరు 29: వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా వైద్య, సచివాలయ సిబ్బంది పనిచేయాలని జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) శ్రీధర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని పెద్దకన్నలి పంచాయతీలో పర్యటించారు. తొలుత గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి, హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. కొందరు సిబ్బంది ఉదయం మాత్రమే సంతకం చేసి ఉండటంతో, మధ్యాహ్నం తర్వాత వీరందరూ ఎక్కడికి వెళ్లారని జేసీ ఆరా తీశారు. అనంతరం కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ తీరు గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఎస్టీకాలనీకి చెందిన పలు కుటుంబాలు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుసుకుని, ఆయన స్వయంగా వారి ఇళ్ల వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఎస్టీలు లేకపోవడంతో అర్హులు వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట సౌభాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.