మెట్ల నుంచి జారిపడి ఒడిశా యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-12-25T05:48:36+05:30 IST

మెట్లపై నుంచి జారిపడి ఒడిశాకు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు.

మెట్ల నుంచి జారిపడి ఒడిశా యువకుడి మృతి
మృతిచెందిన భగీరథనాయక్‌

మదనపల్లె క్రైం, డిసెంబరు 24: మెట్లపై నుంచి జారిపడి ఒడిశాకు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. తాలూకా పోలీసుల కథనం మేరకు... ఒడిశా రాష్ట్రం పాతరవాడ మండలానికి చెందిన భగీరథనాయక్‌(31) నాలుగునెలల కిందట ఉపాధి నిమిత్తం ఇసుకనూతిపల్లె సమీపంలోని ఓ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో కూలీగా చేరాడు.  గురువారం రాత్రి భోజనం అనంతరం నిద్రించేందుకు మిద్దెపైకి వెళుతుండగా జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.   తాలూకా పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతుడి కుటుంబీకులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు.  కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సోమశేఖర్‌ చెప్పారు.

Updated Date - 2021-12-25T05:48:36+05:30 IST