రెండో వైస్‌ ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్‌!

ABN , First Publish Date - 2021-12-29T05:18:14+05:30 IST

మండలాల్లో ఇప్పటికే ఉన్న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలతో పాటు రెండో వైస్‌ ఎంపీపీ పదవి భర్తీ కోసం ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

రెండో వైస్‌ ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్‌!

65 మండలాల్లో జనవరి 4న ఎన్నిక


చిత్తూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలాల్లో ఇప్పటికే ఉన్న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలతో పాటు రెండో వైస్‌ ఎంపీపీ పదవి భర్తీ కోసం ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తమ పార్టీకి చెందిన అసంతృప్తి నేతలకు పదవులు ఇచ్చేందుకు ఇది వరకే జడ్పీలో రెండో వైస్‌ చైర్మన్‌, నగరపాలక సంస్థల్లో రెండో మేయర్‌, మున్సిపాలిటీల్లో రెండో వైస్‌ చైర్మన్‌ పదవులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మండలాల్లో కూడా వైస్‌ ఎంపీపీ పదవిని భర్తీ చేయనుంది. జిల్లాలోని 65 మండలాల్లో ఇటీవల రెండు విడతలుగా ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. రెండో వైస్‌ ఎంపీపీ పదవి భర్తీకి నోటిఫికేషన్‌ రావడంతో మండలాల్లో అసంతృప్తిగా ఉన్న అధికార పార్టీ నేతలకు పదవి లభించే అవకాశం దక్కింది. ఈ నెల 31న రెండో వైస్‌ ఎంపీపీ ఎన్నికకు కలెక్టర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. మండలాల్లో జనవరి 4 ఎంపీపీ, ఎంపీటీసీలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని రెండో వైస్‌ ఎంపీపీని ఎన్నుకుంటారు. ఆ తర్వాత మండల సర్వసభ్య సమావేశం నిర్వహించి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటీవల జరిగిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలకు ఆర్వోలుగా వ్యవహరించిన అధికారులే రెండో వైస్‌ ఎంపీపీ ఎన్నికకు కూడా ఆర్వోలుగా వ్యవహరించనున్నారు.

Updated Date - 2021-12-29T05:18:14+05:30 IST