సగం ధరకే అందుబాటులో కొత్త పుస్తకాలు

ABN , First Publish Date - 2021-12-25T07:02:19+05:30 IST

నూతన సంవత్సరాది సందర్భంగా పుస్తకప్రియుల కోసం జిల్లా రచయితల సమాఖ్య సగం ధరకే కొత్త పుస్తకాలను అమ్మే ప్రయత్నం చేస్తోంది.

సగం ధరకే అందుబాటులో కొత్త పుస్తకాలు

తిరుపతిలో రెండ్రోజులపాటు విక్రయాలు


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 24: నూతన సంవత్సరాది సందర్భంగా పుస్తకప్రియుల కోసం జిల్లా రచయితల సమాఖ్య సగం ధరకే కొత్త పుస్తకాలను అమ్మే ప్రయత్నం చేస్తోంది. తిరుపతి బాలాజీ కాలనీలో ఉన్న ఎస్వీ హైస్కూల్‌ గ్రౌండ్‌ ఎదురుగా రెండ్రోజులపాటు ఈ పుస్తక విక్రయాలు చేపట్టనున్నారు. శని, ఆదివారాల్లో సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఏడు గంటల వరకు పుస్తకాలను విక్రయించనున్నట్లు సమాఖ్య కన్వీనర్లు సాకం నాగరాజ, పలమనేరు బాలాజి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-12-25T07:02:19+05:30 IST