ఎస్వీయూ అథ్లెటిక్స్‌ జట్టు మేనేజరుగా నరసింహారావు

ABN , First Publish Date - 2021-12-30T06:08:15+05:30 IST

ఎస్వీయూ అథ్లెటిక్స్‌ జట్టు మేనేజరుగా శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల వ్యాయామ సంచాలకుడు నరసింహారావు నియమితులయ్యారు.

ఎస్వీయూ అథ్లెటిక్స్‌ జట్టు మేనేజరుగా నరసింహారావు
నరసింహారావు

శ్రీకాళహస్తి, డిసెంబరు 29: ఎస్వీయూ అథ్లెటిక్స్‌ జట్టు మేనేజరుగా శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల వ్యాయామ సంచాలకుడు నరసింహారావు నియమితులయ్యారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరులో వచ్చేనెల 4 నుంచి 7వతేదీ వరకు అఖిలభారత పురుషుల అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ఎస్వీయూ పురుషుల జట్టుకు ఆయన మేనేజరుగా వ్యవహరించనున్నారు. కాగా, నరసింహారావు 2021-22కుగాను ఎస్వీయూ, యోగివేమన యూనివర్శిటీల అథ్లెటిక్స్‌ జట్టుకు సెలెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఆయన నియామకం పట్ల శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ నారాయణరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ దీనదయాల్‌, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్‌ మహేశ్వరి, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-12-30T06:08:15+05:30 IST