ఆలయాలకు మైక్‌సెట్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-05-03T04:16:36+05:30 IST

జిల్లావ్యాప్తంగా దళితవాడల్లోని 53 ఆలయాలకు చిత్తూరు హిందూ ధర్మ ప్రచారపరిషత్‌ ఆధ్వర్యంలో మైక్‌ సెట్లను పంపిణీ చేశారు.

ఆలయాలకు మైక్‌సెట్ల పంపిణీ

చిత్తూరు కల్చరల్‌, మే2: జిల్లావ్యాప్తంగా దళితవాడల్లోని 53 ఆలయాలకు చిత్తూరు హిందూ ధర్మ ప్రచారపరిషత్‌ ఆధ్వర్యంలో మైక్‌ సెట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు చిత్తూరు టీటీడీ కల్యాణ మండపం హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ప్రోగ్రాం అసిస్టెంట్‌ భద్రావతి ఆదివారం ఒక  ప్రకటనలో తెలిపారు. మైక్‌సెట్ల కిట్లలో 16 జీబీ పెన్‌డ్రైవ్‌ , 40 వాట్‌ ఆంప్లీప్కేలయర్‌, 2 పీఏ హరన్‌ స్వీకర్లు, 1 వాల్‌ స్వీకరు, 1 పీఏ మైక్రోపీన్‌, 1 మైక్‌స్టాండ్‌, 50 మీటర్ల మైక్‌ వైర్‌లతో కలిపి ఆయా ఆలయాల నిర్వాహకులకు అందజేశామని ఆమె తెలియజేశారు. కార్యక్రమంలో కల్యాణమండపం మేనేజరు సుభాషిణి, సమరసత సేవా ఫౌండేషన్‌ నిర్వాహకులు పాల్గొన్నారన్నారు.

Updated Date - 2021-05-03T04:16:36+05:30 IST