ఉదయం 6 గంటలకే రోడ్లపై ఉండాలి
ABN , First Publish Date - 2021-12-16T05:28:28+05:30 IST
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద చెత్త సేకరణలో భాగంగా గురువారం నుంచి పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లు ఉదయం 6 గంటల కల్లా రోడ్లపై ఉండాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆదేశించారు.

పంచాయతీ సెక్రటరీలు, వలంటీర్లకు కలెక్టర్ ఆదేశం
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 15: జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద చెత్త సేకరణలో భాగంగా గురువారం నుంచి పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లు ఉదయం 6 గంటల కల్లా రోడ్లపై ఉండాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. సమావేశంలో జేసి సి.హెచ్.శ్రీధర్, పీఆర్‌ఎస్ ఈ అమర్‌నాథ రెడ్డి, డ్వామా పీడీ చంద్రశేఖర్, డీపీవో దశరథరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.