ముక్కంటి హుండీ ఆదాయం రూ.96.96 లక్షలు

ABN , First Publish Date - 2021-12-30T06:06:02+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ద్వారా రూ.96.96 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు చెప్పారు.

ముక్కంటి హుండీ ఆదాయం రూ.96.96 లక్షలు
భక్తుల కానుకలను లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

శ్రీకాళహస్తి, డిసెంబరు 29: శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ద్వారా రూ.96.96 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు చెప్పారు. బుధవారం ఆలయ ప్రధాన హుండీ, పరివార దేవతల వద్ద ఉన్న హుండీల లెక్కింపు జరిగింది. ఆ మేరకు.. భక్తుల నుంచి నగదుతోపాటు బంగారం 78.5 గ్రాములు, వెండి 318.100 కేజీలు, పలుదేశాల కరెన్సీ నోట్లు 40 వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఈనెల 10వతేది నుంచి ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T06:06:02+05:30 IST