జ్వరాలు ప్రబలకుండా చర్యలు

ABN , First Publish Date - 2021-12-25T05:35:51+05:30 IST

గ్రామీణప్రాంతాల్లో జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధారాణి ఆదేశించారు.

జ్వరాలు ప్రబలకుండా చర్యలు
వైద్య సిబ్బందికి సూచనలిస్తున్న డాక్టర్‌ సుధారాణి

ఏర్పేడు, డిసెంబరు 24: గ్రామీణప్రాంతాల్లో జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధారాణి ఆదేశించారు. శుక్రవారం ఆమె మండలంలోని కోబాక హరిజనవాడలో పర్యటించారు. ఉచిత వైద్య శిబిరాన్ని తనిఖీ చేసి గ్రామ వీధులను పరిశీలించారు. డాక్టర్‌ సుధారాణి మాట్లాడుతూ.. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడా నీటి నిల్వల్లేకుండా చూడాలనీ, లేదంటే రోగాలు వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బుజ్జమ్మ, సీహెచ్‌వో  శివరాజు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ కామరాజు, పంచాయతీ కార్యదర్శి లోకముని తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-25T05:35:51+05:30 IST