చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి మామిడి రైతుల యత్నం

ABN , First Publish Date - 2021-06-21T18:40:54+05:30 IST

మామిడి రైతులు చిత్తూరు కలెక్టరేట్‌ను ముట్టడించారు.

చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి మామిడి రైతుల యత్నం

చిత్తూరు: మామిడి రైతులు చిత్తూరు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ధరల భారీ పతనాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు హెచ్చరించారు. కలెక్టరేట్ ఎదురుగా మామిడిపండ్లను పారబోసి నిరసనకు దిగారు. మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2021-06-21T18:40:54+05:30 IST