పల్స్ పోలియోను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2021-12-30T06:31:29+05:30 IST
వచ్చే నెల 23నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఐవో శ్రీనివాసరావు వైద్యాధికారులకు సూచించారు.

చిత్తూరు రూరల్, డిసెంబరు 29: వచ్చే నెల 23నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఐవో శ్రీనివాసరావు వైద్యాధికారులకు సూచించారు. బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో వైద్యాధికారులకు పల్స్‌పోలియో కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23వ తేదీన బూత్ లెవల్ యాక్టివిటీ, 24, 25 తేదీల్లో హౌస్ టూ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన కార్యచరణ ప్రణాళికను వైద్యాధికారులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మోబైల్ వాహనం ద్వారా ప్రతి ఒక్కరికీ పోలియో చుక్కలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంవో భవాని, ఏడీఎంహచ్‌వో పెంచలయ్య, పీవోడీటీ లోకవర్థన్, ఆర్‌బీఎస్కే కోఆర్డినేటర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.