‘ఆజాదీ కా అమృత్‌’ను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-11-06T05:22:54+05:30 IST

ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 8నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఆజాదీ కా అమృత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఐ.కరుణకుమార్‌ పిలుపునిచ్చారు.

‘ఆజాదీ కా అమృత్‌’ను విజయవంతం చేయండి

చిత్తూరు(లీగల్‌), నవంబరు 5: ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 8నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఆజాదీ కా అమృత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఐ.కరుణకుమార్‌ పిలుపునిచ్చారు. చిత్తూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఆజాది కా అమృత్‌ కార్యక్రమంపై పలు శాఖలు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత న్యాయ సేవలపై ప్రజలకు అవగాహన పెంచుకునేందుకు ఆజాదీ కా అమృత్‌ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. శాఖల వారీగా అభివృద్ధి, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌, చాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దిశ డీఎస్పీ బాబుప్రసాద్‌, తిరుపతి డీఎస్పీ నాగసుబ్బన్న, వృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, జిల్లా సబ్‌జైలు అధికారి హుస్సేన్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ వేణుగోపాలరెడ్డి, ఆర్టీసీ డివిజనల్‌ మేనేజరు ధనంజయ, లీడ్‌ బ్యాంకు మేనేజరు శేషగిరిరావు, మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీలక్ష్మి, జిల్లా టూరిజం అధికారి ఉమాపతి, ట్రాన్స్‌కో ఈఈ అమర్‌బాబు, చిత్తూరు ఎంపీడీవో వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-06T05:22:54+05:30 IST