కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు తరలిన మదనపల్లె టీడీపీ నాయకులు

ABN , First Publish Date - 2021-12-28T06:08:14+05:30 IST

ఓటీఎస్‌ రద్దు డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద సోమవారం ని ర్వహించిన ధర్నాకు మదనపల్లె నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు తరలివెళ్లారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు తరలిన మదనపల్లె టీడీపీ నాయకులు
చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో పాల్గొన్న మదనపల్లె టీడీపీ నేత జయరామ్‌నాయుడు, తదితరులు

మదనపల్లె టౌన్‌, డిసెంబరు 27: ఓటీఎస్‌ రద్దు డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌  వద్ద సోమవారం ని ర్వహించిన ధర్నాకు మదనపల్లె నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు తరలివెళ్లారు. టీడీపీ నేత ఎస్‌.జయరామనాయుడు ఆధ్వర్యంలో రాజం పేట పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి దొర స్వామినాయుడు, పెంచుపాడుస్వామి, ఆనంద్‌ నాయుడు, సాయికిరణ్‌, వినోద్‌ తదితరులు హాజ రయ్యారు. మదనపల్లె నియోజకవర్గంలో ఓటీఎస్‌ రద్దుకు అన్ని మండలాలతో పాటు, మున్సి పాలిటీలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని దొరస్వామినాయుడు ఈ సందర్భంగా తెలిపారు. 


Updated Date - 2021-12-28T06:08:14+05:30 IST