మదనపల్లె జంట హత్య కేసులో వీడని చిక్కుముడి
ABN , First Publish Date - 2021-02-03T13:27:46+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి ఇద్దరు కుమార్తెల జంట హత్య కేసులో చిక్కుముడి ఇంకా వీడలేదు.
చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి ఇద్దరు కుమార్తెల జంట హత్య కేసులో చిక్కుముడి ఇంకా వీడలేదు. మదనపల్లె సబ్ జైలులో తల్లి పద్మజ మానసిక స్థితి యథాతదంగా ఉంది. పగలు నిశ్సబ్దంగా ఉంటున్న పద్మజ...రాత్రి అయితే చాలు శివ..శివ అంటూ అరుపులు, కేకలతో తోటి ఖైదీలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అటు సబ్ జైలులో భర్త పురుషోత్తం నాయుడు మాత్రం కుమార్తెలను తలుచుకుంటూ ఏడుస్తూ ఢీలా పడిపోయారు. వీరిద్దరిని విశాఖపట్నం తరలింపుకు ఎస్కార్టు కోసం సబ్ జైలు అధికారులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఎస్కార్ట్ పంపడంలో పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.